ఆర్తీ విషాదాంతం పై సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు

Aarthi-Aggarwal
కేవలం 31ఏళ్ళ వయసులోనే హార్ట్ ఎటాక్ కారణంగా నటి ఆర్తీ మృతిచెందడంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమైన ఆర్తీ టాలీవుడ్ లో అగ్రనటులందరితోనూ నటించింది.

అయితే ఆర్తీ అకాలమరణం అందరినీ కలచివేసింది. పిన్న వయసులోనే ఆమెకు ఇలాంటి పరిస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఈ విషాద వార్త తెలియగానే సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో తమ తమ సంతాపం తెలియజేసారు. ఆర్తీ హార్ట్ ఎటాక్ కారణంగానే చనిపోయిందని ఆమె తండ్రి స్పష్టం చేసారు.

Exit mobile version