టాలీవుడ్లో ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ పైనే వాడివేడి చర్చ నడుస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ సాగాలంటే ఈ విధానం అమలు చేసి తీరాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా, దీనివల్ల తమకు కోట్లలో నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఓ ఒప్పంద ప్రాతిపదికన రాబోయే 17 భారీ బడ్జెట్ సినిమాలకు ఈ కొత్త పర్సంటేజ్ సిస్టమ్ నుంచి మినహాయింపు (Exemption) ఇవ్వాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక కీలక జాబితాను తెరపైకి తెచ్చింది. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుల విషయంలో పాత విధానమే (రెంటల్ సిస్టమ్) కొనసాగాలన్నది ప్రొడ్యూసర్ల ప్రధాన డిమాండ్. ఒకవేళ థియేటర్ల కలెక్షన్లలో పర్సంటేజ్ ఇస్తే, తమ రెవెన్యూ షేరింగ్లో భారీగా కోత పడుతుందని వారు లెక్కలేసుకుంటున్నారు.
మినహాయింపు కోరుతున్న 17 బడా చిత్రాలివే.. నిర్మాతలు ఎగ్జిబిటర్ల ముందుంచిన జాబితాలో టాలీవుడ్ టాప్ స్టార్స్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్ చూస్తే..
రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా ‘పెద్ది’ (Peddi)
మెగాస్టార్ చిరంజీవి – వశిష్ఠ ‘విశ్వంభర’ (Vishwambhara)
నాని ‘ది ప్యారడైజ్’ (TheParadise)
ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుల ‘వారణాసి’ (Varanasi)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘రాకా’ (RaaKa)
విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఏకే 47’ (AK47)
నందమూరి బాలకృష్ణ 111వ సినిమా (NBK111)
రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి ‘ఫౌజీ’ (Fauzi)
రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit)
ప్రశాంత్ వర్మ క్రేజీ సీక్వెల్ ‘జై హనుమాన్’ (Jai Hanuman)
జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ (Dragon)
చిరంజీవి – బాబీ కాంబో (ChiruBobby2 / Mega158)
అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ చిత్రం (AA23)
వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా (Venkatesh – AnilRavipudi Film)
రామ్ చరణ్ – సుకుమార్ (RC17)
ప్రభాస్ – నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD పార్ట్-2’ (Kalki2898AD Part-2)
నేచురల్ స్టార్ నాని – సుజీత్ ప్రాజెక్ట్ (NaniSujeeth)


