ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతల బృందం భేటీ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో జరిగిన ఈ అధికారిక సమావేశంలో ఇరు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ విస్తరణ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు మరియు సినిమా రంగానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలపై నిర్మాతలు డిప్యూటీ సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఇండస్ట్రీ సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు మైత్రీ మూవీస్ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్ మరియు చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పెద్దలతో జరిగిన ఈ భేటీ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి మరింత మేలు చేకూరుస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి,… pic.twitter.com/kKUSLSN9Dz
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 26, 2026
