
పూర్తి సోషల్ మెసేజ్ కథని పక్కా కమర్షియల్ గా చెప్పగల డైరెక్టర్ గా సౌత్ లో పేరు తెచ్చుకున్న తమిళ డైరెక్టర్ శంకర్. ఆయన తర్వాత అదే రీతిలో సొసైటీలోని ఓ బర్నింగ్ పాయింట్ ని కమర్షియల్ గా చెప్పడంలో సక్సెస్ అయిన తమిళ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్. దానికి నిదర్శనమే ఆయన తీసిన రమణ(తెలుగులో ఠాగూర్), స్టాలిన్, తుపాకి, కత్తి సినిమాలు. గత ఏడాది కత్తి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎఆర్ మురుగదాస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ‘అఖిర’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఎఆర్ మురుగదాస్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. మాకు అందిన సమాచారం ప్రకారం సూపర్ స్టార్డం ఉన్న డిస్ట్రిబ్యూటర్ మరియు ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఇద్దరు కలిసి ఓ తెలుగు స్టార్ హీరో తో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో నటించబోయే ఆ తెలుగు స్టార్ హీరో ఎవరా అని అప్పుడే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం కాస్ట్ తగ్గించిన దిల్ రాజు త్వరలోనే వరుసగా స్టార్ హీరోస్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ ని మొదలు పెట్టే పనిలో ఉన్నాడు.