కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా మొత్తం ఐదుగురు హీరోయిన్స్ కాంబినేషన్ లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ చిత్రం “టాక్సిక్” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకి టీజర్ గ్లింప్స్ తో ఒక బ్లాస్ట్ లాంటి ట్రీట్ ని పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ కి అందించింది.
అయితే ఈ టీజర్ (Yash Toxic Teaser) లో మాత్రం ఓ అడల్ట్ సీన్ పై ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. అలాంటి సీన్ ఎందుకు పెట్టారని థియేటర్స్ లో ఇళ్లలో ఇలాంటి సినిమాలు టీజర్ లు ఎలా చూడాలనే కామెంట్స్ యువతలో కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలాంటి సీన్స్ కి సంబంధించి యష్ పై ఓ పాత స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కన్నడ లోనే ఓ టెలివిజన్ ప్రోగ్రాం కి అటెండ్ అయ్యిన యష్ అందులో మాట్లాడుతూ ‘తన తల్లిదండ్రులతో కలిసి చూడలేని సన్నివేశాలు ఉన్న సినిమాలు నేను చేయను’ అంటూ చెప్పిన స్టేట్మెంట్ ని నెటిజన్స్ బయటకి తీసుకొచ్చారు. బహుశా యష్ ఈ స్టేట్మెంట్ ని మర్చిపోయి ఉంటాడు అంటూ తనపై విమర్శలు చేస్తున్నారు. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
