కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇండియన్ వెర్షన్ లోనే కాకుండా హాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా అలరించేందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.
హాలీవుడ్ ప్రముఖ సంస్థ లయన్స్ గేట్ వారితో హాలీవుడ్ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ విషయంలో కొన్ని రూమర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండియన్ వెర్షన్ కి ఏకంగా 20 నిమిషాలు కట్ చేసేశారని దీనితో మన దగ్గర 2 గంటల 55 నిమిషాలు ఉంటే ఓవర్సీస్ వెర్షన్ మాత్రం 3 గంటల 15 నిమిషాలు ఉందని టాక్ వినిపిస్తుంది.
అయితే ఇది హాలీవుడ్ వెర్షన్ కూడానా అనేది క్లారిటీ లేదు. ఇది వరకే టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ లో ఎలాంటి పాటలు లేకుండా ఇంకా తక్కువ నిడివితో విడుదల ఉంటుంది అనే రూమర్స్ వినిపించాయి. సో ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
