టీ ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘C-మంతం’ నుంచి గ్లింప్స్‌ను ఇవాళ విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఈ వీడియో సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజువల్ ప్రెజెంటేషన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీ చేతులు వెనక్కి కట్టిన షాట్స్, రక్తపు చాయలు, మానవత్వానికి వ్యతిరేకమైన ఘటనలు టెన్షన్‌ను పెంచుతున్నాయి. క్లాసిక్ థ్రిల్‌తో పాటు ఎమోషనల్ డెప్త్‌ను కలిపే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
దర్శకుడు సుధాకర్ పాణి కథనాన్ని కొత్త ధోరణిలో చూపించడానికి ప్రయత్నించినట్టు ఈ గ్లింప్స్ సూచిస్తుంది. ప్రశాంత్ టాటా నిర్మాతగా, గాయత్రీ సౌమ్య గుడిసెవా సహనిర్మాతగా పనిచేస్తున్నారు. ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్, మూడ్‌ను ఎలివేట్ చేస్తోంది.
చిత్ర బృందం ప్రకారం, ‘C-మంతం’ త్వరలో థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
