ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!

ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!

Published on Aug 20, 2026 11:07 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ హిట్ చిత్రం ‘రంగస్థలం’ తర్వాత టాలీవుడ్ లో కొత్త ఒరవడి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల పరంగా మాత్రమే కాకుండా హీరోల కథల ఎంపికలో కూడా ఈ సినిమా చాలా ప్రభావం చూపించింది. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ సబ్జెక్టుని రామ్ చరణ్ ఎంచుకోవడమే అప్పట్లో ఒక స్పెషల్ స్టెప్.

అయితే దీనిపైనే లేటెస్ట్ గా ‘ఇరుముడి’ దర్శకుడు శివ నిర్వాణ రామ్ చరణ్ విషయంలో ప్రశంసలు కురిపించారు. రంగస్థలం తర్వాత, రామ్‌ చరణ్ ఇతర స్టార్ హీరోలు సైతం మరింత సున్నితమైన, ఇంటెన్స్ పాత్రలను పోషించడానికి ఒక మార్గాన్ని సులభతరం చేసారని తెలిపారు. సో దీనితో మాస్ మహారాజ రవితేజతో తను చేసిన ఇరుముడి కూడా ఇదే తరహా సబ్జెక్టు అని ముందు నుంచీ చెబుతున్నారు. మరి రిలీజ్ అయ్యాక ఆ అంచనాలు ఇరుముడి అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు