40 ప్లస్ వయసులోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న త్రిష, తాజాగా మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రజినీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న భారీ మల్టీస్టారర్‌లో ఆమె హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాతో ఆమె రాజకీయాల్లోకి వెళ్తుందనే రూమర్లకు చెక్ పడినట్లయింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం త్రిష ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు టాక్. ఆమె కెరీర్లోనే ఇది అత్యధిక రెమ్యూనరేషన్ కావడం విశేషం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
తెలుగులో ఇప్పటికే చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో నటిస్తున్న త్రిష, ఇప్పుడు తమిళంలో ఇద్దరు లెజెండరీ హీరోల సరసన నటించే అవకాశం అందుకోవడం విశేషం. సీనియర్ హీరోయిన్లలో ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా ఆమె తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటోంది.


