శింబు సినిమా నుంచి బయటికొచ్చిన త్రిష!

trisha

తన అందంతో, అభినయంతో తెలుగుతో పాటు తమిళ, హిందీ అభిమానులను సైతం కట్టిపడేసిన హీరోయిన్ త్రిష. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌ అయినా ఐదారేళ్ళకు మించి హీరోయిన్‌గా కొనసాగే అవకాశంలేనంత పోటీ ఉన్న నేపథ్యంలోనూ పదమూడేళ్ళు హీరోయిన్‌గా నిలబడి అభిమానాన్ని సంపాదించించి త్రిష. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న ఆమె పర్సనల్ లైఫ్‌లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగి ఆమెను ఇబ్బందికి గురి చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రముఖ సినీ దర్శకుడు సెల్వ రాఘవన్ తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమాలో త్రిష హీరోయిన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. శింబు, తాప్సీ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫోటోషూట్ కూడా జరిగిపోయింది. అయితే సడెన్‌గా ఈ ప్రాజెక్టు నుంచి త్రిష్ తప్పుకుంది. డేట్స్ కుదరక ఆమె ఆ ప్రాజెక్టు నుండి బయటకొచ్చినట్లు చెబుతున్నా కారణం వేరే ఉందనేది తమిళ మీడియా టాక్. త్రిషతో ఎంగేజ్‌మెంట్ జరిగాక ఆమెతో తెగతెంపులు చేసుకున్న వరుణ్ మానియన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకుందని సమాచారం. త్రిష స్థానంలో వేరొక హీరోయిన్ కోసం సినిమా యూనిట్ వెతుకులాటలో పడింది.

Exit mobile version