భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, తమిళ స్టార్ హీరో మరియు టీవీకే అధ్యక్షుడు విజయ్ ను విమర్శించే క్రమంలో నటి త్రిష ప్రస్తావన తీసుకువచ్చారు. విజయ్ కి – త్రిషకి మధ్య లింక్ పెడుతూ.. నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఐతే, తాజాగా త్రిష తరఫు న్యాయవాది తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేదన్నారు.
సంబంధిత నోట్‌ను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి అగౌరవకరంగా మాట్లాడతారని నా క్లయింట్ ఊహించలేదు. ఆమెకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. పొలిటికల్ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉన్నారు. నటన ద్వారానే తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు గానీ, ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ వల్ల కాదు. సంబంధంలేని విషయాల్లోకి నా క్లయింట్‌ను లాగొద్దు’’ అని రిక్వెస్ట్ చేశారు.
