నిశ్చితార్ధం తరువాత తిరిగి షూటింగ్ లలో పాల్గున్న త్రిష

Trisha1
ఎన్నో మంచి సినిమాలతో తెలుగు యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ఇటీవలే వరుణ్ మానియన్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం కుదుర్చుకున్న భామ త్రిష. ఈ వేడుకకోసం తన షూటింగ్ లకు కొన్ని రోజులు విరామం కేటాయించింది. ఇప్పుడు త్రిష తిరిగి నందమూరి బాలకృష్ణ ‘లయన్’ సినిమా షూటింగ్ లో పాల్గుననుంది.

ఈరోజు హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. సమాచారం ప్రకారం రామ్ – లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొన్ని ముఖ్య యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ షూట్ లో త్రిష, బాలకృష్ణ, ప్రకాష్ రాజ్, జయసుధ మరికొందరు ముఖ్యనటులు పాలుపంచుకుంటున్నారు. ఒక వారం పాటూ ఈ షెడ్యూల్ వుంటుందని అంచనా. ఈ సినిమాకు సత్యదేవా దర్శకుడు. మార్చ్ మూడవ వారంలో ఈ చిత్రాన్ని మనముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version