సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా నుండి మహేష్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోలో సినిమాలోని సాంకేతిక బృందానికి సంబంధించిన డిటైల్స్ అండ్ హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
ఇక ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్ , ఛాయాగ్రాహకుడు గా ‘మధీ‘, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట.
పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.
వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
