వెంకీ మూవీలో బుట్టబొమ్మ.. అసలు సంగతి ఇదే..!

venky pooja

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా ఎంపికైందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందానికి సన్నిహితంగా ఉన్న వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో ‘F3’ చిత్రంలో పూజా ఒక ప్రత్యేక గీతంలో మెరిసిన మాట నిజమే అయినా, ప్రస్తుతం వెంకటేష్ సరసన కథానాయికగా ఆమెతో ఎటువంటి చర్చలు జరగలేదని, అవన్నీ నిరాధారమైన పుకార్లని తేల్చిచెప్పారు.

​తెలుగులో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డేకు ఒక క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు సమాచారం. టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ సరసన ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో దుల్కర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, పూజాకు కూడా కథా పరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న రోల్ దక్కిందని తెలుస్తోంది.

Exit mobile version