2030 వరకు తన లైనప్ రివీల్ చేసిన ‘తుంబాడ్’ దర్శకుడు! ఊహించని కాన్సెప్టులే

Beyond-Tumbbad

ఇండియన్ సినిమా దగ్గర ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు రాహి అనీల్ బర్వె తెరకెక్కించిన “తుంబాడ్” అనే చెప్తారు. అయితే ఇలాంటి సినిమాని అందించిన తన నుంచి నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేవి అందరికి మరింత ఆసక్తి పెంచుతాయి. కానీ అతను తుంబాడ్ సీక్వెల్ నుంచి తప్పుకొని 2030 వరకు తన క్రేజీ లైనప్ ని ఇప్పుడు రివీల్ చేశారు.

తుంబాడ్ తర్వాత 2027 లో తన నుంచి ‘పహాడ్ పంగిరా’ అనే సినిమా ఉంటుంది అని రివీల్ చేశారు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ దేవుళ్ళు, మనుషులు అలాగే భయమనేది తెలియని ఆడవాళ్ళూ, విముక్తి అలానే స్త్రీవాదం పుట్టుక వంటి అంశాలతో ఆ సినిమా ఉంటుంది అని రివీల్ చేశారు.

అలాగే 2030 కి “పక్షి తీర్థ” అనే సినిమా వస్తుందని తెలిపారు. ఈ సినిమా మగ, ఆడ మరియు సృష్టికి సంబంధించిన చివరి సాక్షి, పురాణాల్లో ప్రసిద్ధి చెందిన పక్షి ‘కాకభుశుండి’కి సంబంధించిన ఒక చీకటి గాథ ని తాను తెరకెక్కించి విడుదల చేయనున్నట్టు తన క్రేజీ లైనప్ ని ఇపుడు అనౌన్స్ చేశారు. దీనితో తన ఫాలోవర్స్ కి మాత్రం ఈ రానున్న నాలుగేళ్లలో మంచి ట్రీట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Exit mobile version