మోడీపై సెటైర్ వేసిన స్టార్ హీరో వైఫ్

twinkl

బాలీవుడ్ స్టార్ హీరో సతీమణి నటి ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా వేదికగా మోడీ పై సెటైర్ వేశారు. ఈ దేశంలో విద్యార్థుల కంటే కూడా గోవులే సురక్షితం అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే నిన్న ఢిల్లీలోని ప్రముఖ విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని కొందరు దుండగులు యూనివర్సిటీ క్యాంపస్ లోకి ప్రవేశించి కొందరు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం మీడియా మరియు సోషల్ మాధ్యమాలలో సంచలనంగా మారింది. విధ్యార్ధులపైన దాడులకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సి ఏ ఏ మరియు ఎన్ ఏ సి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశిస్తూ ట్వింకిల్ ఖన్నా తన అధికారిక ట్విట్టర్ ద్వారా.. హింసతో ప్రజా ఆగ్రహాన్ని అణచివేయలేరు. దాని వలన ప్రజలు వీధులలోకి వచ్చి మరిన్ని ఉద్యమాలు చేస్తారని అన్నారు. ట్వింకిల్ ఖన్నా లో సామజిక స్పృహ చాలా ఎక్కువ. ఆమె తరచుగా సామజిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు, సామాజిక అంశాలపై తన గళం విప్పుతారు.

Exit mobile version