ట్విస్ట్: వెంకీ మామ సినిమాకి కొత్త సంగీత దర్శకుడు ఎంట్రీ!

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే “ఆదర్శ కుటుంబం”. అనౌన్సమెంట్ నుంచే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి అనిమల్ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు అనగానే చాలామంది ఎగ్జైట్ అయ్యారు.

కానీ ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని కొత్త సంగీత దర్శకుడు కూడా యాడ్ అవ్వడం జరిగినట్టు తెలుస్తుంది. మరి ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు త్రివిక్రమ్ తో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న థమన్ అట. ఇలా థమన్ ఈ క్రేజీ కాంబినేషన్ లో మళ్ళీ వచ్చినట్టు ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్టు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version