‘బెంగళూరు డేస్’ రీమేక్‌కు ఇద్దరు దర్శకులు?

bommarillu-bahaskar-venu-sr
గత సంవత్సరం మళయాలంలో విడుదలై సంచల విజయం సాధించిన చిత్రం.. ‘బెంగళూరు డేస్’. ‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయం కానున్న దుల్కర్ సల్మాన్‌తో పాటు నివిన్, నాజ్రియా తదితరులు నటించిన ఈ చిత్రం గత సంవత్సరం విడుదలైన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, పీవీపీ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా కాస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడెవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మళయాలంలో అంజలీ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. ఆమధ్య ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే.. తాజా సమాచారం మేరకు ఈ ఇద్దరూ ‘బెంగళూరు డేస్’ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. తమిళ వర్షన్‌కు భాస్కర్, తెలుగు వర్షన్‌కు వేణు శ్రీరామ్ పని చేస్తారని తెలుస్తోంది. తెలుగులో శర్వానంద్, వరుణ్ తేజ్, అవసరాల శ్రీనివాస్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

Exit mobile version