ఉదయ్ కిరణ్ బయోపిక్ నిజంగానే వస్తోందా ?

Uday Kiran

‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయి.. అనతికాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుని అతివేగంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో ఉదయ్ కిరణ్. అప్పట్లో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని.. వరుస హిట్స్ సాధించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన ఉదయ్ కిరణ్ కెరీర్, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బాక్సాఫీస్ రేసులో నుండి వెనుకపడిపోయింది.

దానికి తోడు వరుస ఫ్లాపులతో మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ మూవీ ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించినా ఉదయ్ మళ్లీ ట్రాక్ లోకి రాలేదు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ మానసిక క్షోభతోనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే ఉదయ్ కిరణ్ మరణించి ఐదేళ్లు దాటినా ఇంకా అభిమానులు ఉదయ్ కిరణ్ ను తలుచుకుంటూనే ఉన్నారు.

అయితే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందట. ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్ కిషన్ నటించబోతున్నాడట. మరి ఈ బయోపిక్ నిజంగానే వస్తోందా..? లేక కేవలం ప్రకటన వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.

Exit mobile version