టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన క్లాసిక్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఎంటర్‌టైనర్ ‘నీ స్నేహం’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు నిర్మాణంలో, పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడమే కాకుండా, యూత్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఆర్.పి. పట్నాయక్ అందించిన సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఇప్పుడు ఈ క్లాసిక్ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ‘నీ స్నేహం’ చిత్రాన్ని 4K డిజిటల్ వెర్షన్‌లో సెప్టెంబర్ 19న గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి న్యూస్ అని చెప్పాలి. మరి ఈ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను థియేటర్లలో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


