కమల్ ‘పాపనాశనం’ సినిమాకు పాజిటివ్ టాక్!

Papanasam_poster
మోహల్ లాల్ హీరోగా రూపొంది 2013లో ఘనవిజయం సాధించిన సినిమా ‘దృశ్యం’. ఇక ఈ సినిమాను అదే పేరుతో విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయగా ఇక్కడా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! తాజాగా ఈ థ్రిల్లర్‌ నేడు తమిళ ప్రేక్షకులను సైతం మెప్పించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ హీరోగా ‘దృశ్యం’ మాతృక దర్శకుడు జీతూయే ‘పాపనాశనం’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు.

నేడు ఈ సినిమా తమిళ నాట భారీ ఎత్తున విడుదలైంది. ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోరాడడం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో కూడా మచ్చి రెస్పాన్స్ తెచ్చుకుంది. బలమైన కథ కావడం, అలాంటి కథకు కమల్ హాసన్ లాంటి స్టార్ నటుడు తోడవ్వడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారీ అంచనాల మధ్యన విడుదలైన సినిమా కావడంతో తమిళ నాట మంచి కలెక్షన్లు కొల్లగొట్టేందుకు సినిమాకు అన్ని అవకాశాలున్నాయని ట్రేడ్ టాక్!

Exit mobile version