
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని రొటీన్ కి భిన్నంగా సరికొత్త రీతిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిచనున్నాడు. ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఆడియో లాంచ్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వచ్చే ఓ పాటని వారణాశిలో షూట్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్ కూడా దాదాపు చివరి దశలో ఉంది. వారణాశి షెడ్యూల్ పూర్తయ్యాక మిగిలి ఉన్న టాకీ పార్ట్ ని హైదరబాద్ లో ఫినిష్ చేసేస్తారు. నవంబర్ 28న రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.