థియేటర్‌/ఓటీటీ : ఈ వారం అలరించే చిత్రాలివే!

 

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో కూడా ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

 

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

అన్నీ మంచి శకునములే’ :

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమాని యువ నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకదత్‌ నిర్మించారు. మే 18న థియేటర్స్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బిచ్చగాడు’ :

హీరో విజయ్‌ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’. కావ్య థాపర్‌ కథానాయిక. ఈ సినిమా మే 19న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ ఫ్లిక్స్‌ :

అయాలవాషి (మలయాళం)మే 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కథల్‌ (హిందీ) మే 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బయీ అజైబి (ఇంగ్లీష్‌) మే 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మ్యూటెడ్‌ (ఇంగ్లీష్‌) మే 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నామ్‌ (సీజన్‌-2) మే 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీ లివ్‌ :

కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) మే 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అఖిల్‌ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. ఇప్పుడు సోనీలివ్‌ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+ హాట్‌స్టార్‌’ :

వివాహానంతరం నిహారిక కొణిదెల ‘డెడ్‌ పిక్సెల్స్‌’ వెబ్‌ సిరీస్‌తో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

మోడ్రన్‌ లవ్‌ చెన్నై (తమిళ్‌) మే 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version