ఇటీవలే ‘భరత్ అనే నేను’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ కూడ ‘రంగస్థలం’ లాంటి భారీ విజయాన్ని అందుకొని ఉండటంతో వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమాకు సిద్దమవుతున్న మహేష్ అది పూర్తికాగానే సుకుమార్ సినిమాను మొదలుపెట్టనున్నారు. మరోవైపు సుకుమార్ అయితే ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ఆరంభించి నటీ నటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. అంతేగాక దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసుకున్నారు కూడ. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
