తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 36వ చిత్రం ఎన్ జీకే చిత్రంయొక్క ప్రమోషన్స్ ఈనెలలో స్టార్ట్ చేయనున్నారని తెలిసిందే. దాంట్లో భాగంగా అక్టోబర్ 4న ఈచిత్రం గురించి ముఖ్యమైన అప్ డేట్ వెలుబడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక సూర్య అభిమానులు ఈ చిత్రం యొక్క ఈ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
