
కన్నడలో సూపర్ స్టార్, కానీ తెలుగులో కూడా సూపర్ ఇమేజ్ ఉన్న హీరో ఉపేంద్ర. ఆయన నటించిన ‘ఎ’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘సూపర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించించాడు. ఉపేంద్ర నటించే సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఉన్నా కథ – కథనం – టేకింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా వచ్చి 1999లో సూపర్ హిట్ అయిన ఉపేంద్ర సినిమాకి సీక్వెల్ గా ‘ఉపేంద్ర 2’ సినిమాని తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని చేసిన ఈ సినిమాని కన్నడంలో ‘ఉప్పి 2’ పేరుతో తెరకెక్కించాడు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఒకేసారి కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఆగష్టు 14వ తేదీని ఫిక్స్ చేసారు. తెలుగులో కూడా ఉపేంద్రకి మంచి క్రేజ్ ఉండడంతో తెలుగులోనూ గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చెయ్యనున్నారు. ఉపేంద్ర రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘S/O సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర ఓ ముఖ్య పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ఉపేంద్ర 2 సినిమా తెలుగు వారిని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి అంటే మరో 5 రోజులు వేచి చూడాల్సిందే..

