ఈ ఉగాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో చేసిన అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా రీసెంట్ గానే సెన్సార్ కూడా పూర్తి చేసేసుకుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ 2 గంటల 34 నిమిషాల మేర నిడివి కట్ చేసిన ఈ సినిమాలో సెకండాఫ్ ఒకింత ఎక్కువ ఉంటుంది అని టాక్ ఉంది.
ఇక లేటెస్ట్ గా సెన్సార్ బజ్ అంటూ ఒక టాక్ వైరల్ గా మారింది. సినిమా ఫస్టాఫ్ అంతా మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో వెళితే సెకండాఫ్ మాత్రం మాస్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తో వెళుతుంది అన్నట్టు టాక్. సో హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమాని మంచి ప్యాకెడ్ గా రెడీ చేసారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మార్చ్ 19న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
