ఏపీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి హైక్స్.. ప్రీమియర్ షోస్ డీటెయిల్స్!

USB 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాకి కూడా ప్రీమియర్స్ ఉంటాయి అని దర్శకుడు హరీష్ శంకర్ ఆ మధ్య హింట్ ఇచ్చారు. అయితే ఓ పక్క టికెట్ ధరల హైక్ లు వద్దని ఓ వర్గం అంటుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం హైక్స్ దక్కుతాయి అనే ఇప్పుడు వినిపిస్తుంది.

తెలంగాణలో ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు కానీ ఏపీలో మాత్రం ఆల్రెడీ ఉస్తాద్ ప్రీమియర్ షోస్ మరియు టికెట్ ధరల పెంపుపై అభ్యర్ధన కూడా వెళ్లినట్టు తెలుస్తుంది. ముందు రోజు రాత్రి షోస్ కి టికెట్ ధర 500 రూపాయలు గాను రిలీజ్ రోజు నుంచి టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్స్ అయితే 100, మల్టిప్లెక్స్ లలో 125 రూపాయల పెంపు ఈ సినిమాకి ఉంటుందట. మరి ఇది ఎన్ని రోజులు వరకు ఉంటుంది అనేది అధికారిక జీఓ వస్తే ఓ క్లారిటీ వస్తుంది.

Exit mobile version