
విశ్వ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘ఉత్తమ విలన్’. పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 2 లేదా 3వ తేదీలలో విడుదల చేసే అవకాశం ఉంది. జిబ్రాన్ స్వరపరిచిన ఆడియోను మార్చి 1న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
మొదట ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలనీ ప్రయత్నించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం కావడం, క్రికెట్ వరల్డ్ కప్ ఉండడంతో ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయడం బెటర్ అని భావించారు. కమల్ హాసన్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించిన ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించాయి. లింగుస్వామి నిర్మాత. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ‘ఉత్తమ విలన్’ను విడుదల చేస్తుంది.