వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై సీనియర్ హీరో వడ్డే నవీన్ స్వయంగా నిర్మించి, నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రాశి సింగ్, రఘుబాబు, బాబా బాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 19న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా.. హీరో, నిర్మాత వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించి విశేషాలను పంచుకున్నారు.
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కథను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి?
ఈ సినిమాలోని మెయిన్ పాయింట్, కథ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా దర్శకుడు ఈ కథను మలిచాడు. స్టోరీ లైన్ నాకు బాగా నచ్చడం, పైగా ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాను.
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మీ కంఫర్ట్ జోన్‌కి దూరంగా ఉంది కదా?
ప్రస్తుతం ఆడియన్స్ మైండ్‌సెట్, సినిమా చూసే తీరు పూర్తిగా మారింది. కేవలం రెగ్యులర్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే ఇస్తే సరిపోవడం లేదు. ఏదైనా సరికొత్త పాయింట్, కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో అలాంటి ఒక వైవిధ్యమైన కొత్త కంటెంట్‌ను అందిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఎమోషన్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేశాం.
రీ ఎంట్రీలో మీరే నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?
నాకు ఈ కథ మీద ఉన్న నమ్మకం వేరే నిర్మాతలకు కూడా ఉండాలని లేదు. వేరే ప్రొడ్యూసర్ అయితే కథను మారుస్తారని కాదు గానీ.. ఈ సబ్జెక్ట్‌ను నేను అంతలా నమ్మాను. అందుకే ఎక్కడా రాజీ పడకుండా నేనే స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చాను.
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా?
త్రిమూర్తులు పాత్రలోనే చాలా ఎంటర్టైన్మెంట్ దాగుంది. ఇందులో నేను సిస్టమ్‌లో ఉంటూనే పోరాడే ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తాను. దీనికోసం స్క్రిప్ట్ మీద దాదాపు ఏడాది పాటు వర్క్ చేశాం. ప్రేక్షకులు ఊహించే రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా, ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా సాగుతుంది.
దర్శకుడు కమల్ గురించి చెప్పండి?
కమల్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డాడు. మేమిద్దరం దాదాపు ఏడాది పాటు కేవలం స్క్రిప్ట్‌ను పర్‌ఫెక్ట్‌గా మలచడం పైనే కూర్చున్నాం. ఒక కొత్త దర్శకుడైనా సరే, కమల్ మేకింగ్ స్టైల్, స్క్రీన్‌పై సీన్స్ ప్రెజెంట్ చేసిన టేకింగ్ విధానం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది.
రాశీ సింగ్ గురించి చెప్పండి?
ఈ సినిమాలో ఆమె త్రిమూర్తులు భార్యగా కనిపిస్తారు. రాశీ గారు తన పాత్రలో అద్భుతంగా నటించారు. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఆమె క్యారెక్టర్ థియేటర్లలో ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.
నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నారు?
ప్రస్తుతం సోలో హీరోగా చేస్తున్నాను, మున్ముందు కూడా అలాగే కంటిన్యూ అవ్వాలనుంది. అయితే కథ బాగా నచ్చితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి కూడా నేను రెడీ. అలాగే మంచి కంటెంట్ దొరికితే ఓటీటీ వేదికల కోసం ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
