అరుణ్ పవర్ దర్శకత్వంలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘వజ్ర కవచధార గోవింద’. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్ పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు బుల్గానియన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సప్తగిరి సరసన హీరోయిన్గా వైభవి జోషి నటిస్తోంది.
కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం మే నెలలో రిలీజ్ కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సప్తగిరి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
