
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే పూర్తయ్యి విడుదలకు రెడీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక సాంగ్ ను కొన్ని పోస్టర్స్ మరియు టీజర్ ను ఇప్పటి వరకు విడుదల చేశారు. అలాగే విడుదల తేదీని కూడా ప్రకటించేసారు.
అయితే ఎప్పుడో గత ఏడాది ఇచ్చిన ఓ అప్డేట్ కు ఇప్పుడు ఇవ్వబోతున్న అప్డేట్ కు ఏకంగా సరిగ్గా ఏడాది సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమాలోని హిట్ ట్రాక్ “మగువా మగువా” సాంగ్ ను గత ఏడాది మార్చ్ 8న విడుదల చెయ్యగా ఇప్పుడు సరిగ్గా అదే మార్చ్ 8న సెకండ్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అంటే ఓ పాట కోసమే సంవత్సరం సమయాన్ని తీసుకున్నారు. మరి ఇదిలా ఉండగా థమన్ మంచి బాణీలనే అందించినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం తాలూకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.