
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ నెల 9న విడుదలకానున్న సంగతి తెలిసిందే. సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ సినిమా అంటేనే బిజినెస్, వసూళ్లు లెక్కలు. ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసింది, ఎక్కడ ఎంత ఓపెనింగ్స్ తెచ్చింది లాంటి విషయాల గురించే అభిమానులు, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మూడేళ్ళ తర్వాత వస్తున్న సినిమా అంటే ఆ విషయాల మీద ఆసక్తి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కల్ని ఒక్కసారి చూద్దాం.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 74 కోట్లకు పైమాటే. నైజాంలో హక్కులు 23 కోట్లకు అమ్ముడవ్వగా సీడెడ్ ఏరియాలో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 10 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 7 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 6 కోట్లు, గుంటూరు 7 కోట్లు, కృష్ణా జిల్లా 6 కోట్లు, నెల్లూరు 3.35 కోట్లుగా ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలువుకుంటే మొత్తం బిజినెస్ 83 కోట్లకు పైనే. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 84 నుండి 85 కోట్లు అనుకివచ్చు. కాబట్టి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలు చూడాలంటే సినిమా 100 కోట్ల షేర్ మార్కును దాటాల్సిందే.