వాల్మీకి షూటింగ్ స్టార్ట్ !

ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎట్టకేల మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నాడు. డీజే తరువాత కొత్త చిత్రాన్ని మొదలు పెట్టడానికి కి చాలా టైం తీసుకున్నాడు హరీష్. ఇక ఈరోజు తన కొత్త సినిమా ‘వాల్మీకి’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ కల్ట్ మూవీ ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహ పోషించిన పాత్రలో నటిస్తున్నాడు అలాగే సిద్దార్థ పాత్రకి తమిళ యువ హీరో అథర్వ మురళి ని తీసుకుంటారనే టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో వరుణ్ కొత్త లుక్ లో కనిపించనుండగా కథానాయికగా ఎవరిని తీసుకుంటారో క్లారిటీ రావాల్సి వుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

Exit mobile version