
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలతో పోల్చుకుంటే ప్రయోగాత్మక లేదా ట్రెండ్ సెట్ చేసే ఒక న్యూ జోనర్ ఫిల్మ్స్ చాలా తక్కువ, చాలా అరుదుగా కూడా వస్తుంటాయి. అలాంటి డిఫరెంట్ కథలతో సినిమాలు చేసే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ‘సాహసం’ లాంటి ట్రెజర్ హంట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి సినిమా కోసం ఓ ఫ్యామిలీ డ్రామాని సిద్దం చేస్తున్నాడని ఇది వరకే తెలియజేశాం.
ఈ సినిమాకి ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అయిన సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మిస్తాడని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఓకే క్రేజీ హీరోని సెలక్ట్ చేసారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేయగా అలనాటి హీరోయిన్ గౌతమి హీరోయిన్ గా కనిపించనుంది. మోహన్ లాల్ కూడా చంద్రశేఖర్ యేలేటి చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే వారాహి బ్యానర్ వారు ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి నవంబర్ మూడవ వారంలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా వెల్లండించనున్నారు.