చిక్కుల్లో వరలక్ష్మీ శరత్ కుమార్.. డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్..!

వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ అనే చిన్న సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌కు వరలక్ష్మి హాజరుకాకపోవడంపై చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమా కోసం లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ప్రమోషన్స్ చేయడానికి మాత్రం వెనకాడుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్‌కు డబ్బింగ్ చెప్పిన ఆమె, తన మరో సినిమా ‘సరస్వతి’ షూటింగ్ కోసం మధ్యలోనే వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేయకుండా దాదాపు మూడు నెలల పాటు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆమెకు మా సినిమా చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ప్రెస్ మీట్‌కు రావాలని నేను ఆమెను బతిమిలాడినా సాధ్యం కాదని చెప్పేశారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా.. ‘షూటింగ్ సమయంలో ఆమె చేయి విరిగినప్పటికీ, నేను కథను మార్చి మరీ ఆమెకు పూర్తి సహకారం అందించాను. ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు, 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు గారు కూడా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వరలక్ష్మి తన రెమ్యునరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు, దానికి నేను అభ్యంతరం చెప్పను. కానీ ఇలా ప్రమోషన్స్‌కు రాకుండా మా కెరీర్‌లను దెబ్బతీస్తున్నారు’ అంటూ దర్శకుడు సంజీవ్ తీవ్ర విమర్శలు చేశారు.

Exit mobile version