సవతుల పోరులో టాలెంటెడ్ హీరోయిన్స్ ?

Varalaxmi Sarathkumar Aish

డిజిటల్ స్ట్రీమింగ్స్ రోజురోజుకూ జనంలోకి బాగా వెళ్తుండటంతో ఇప్పుడు అందరూ డిజిటల్ వైపే చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. అలాగే కొందరు స్టార్స్ కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. వెబ్ సిరీస్ కథలను కూడా నటించేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష, అమలాపాల్ కూడా వెబ్ సిరీస్ లు చేయబోతున్నారు.

ఇప్పుడు వీరి బాటలోనే వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అండ్ ఐశ్వర్య రాజేష్ కలిసి తమిళంలోని ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇది ఇద్దరి సవతుల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని, ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అండ్ ఐశ్వర్య రాజేష్ ఈ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారట. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది.

Exit mobile version