మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే వారణాసి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ భారీ అంచనాలతో రాబోతోంది. అయితే మహేష్ బాబు విషయంలో ఓ బిగ్ అప్డేట్ ని తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో తన పుట్టినరోజు కానుకగా ఎదురు చూస్తున్నారు.
మరి ఎట్టకేలకు ఆ నెల ఇప్పుడు ఆరంభం అయింది. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కాగా మహేష్ మంత్ స్టార్ట్ అయ్యింది అని ఆల్రెడీ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. సో ఈ ఆగస్ట్ 9న మాత్రం వారణాసి నుంచి బిగ్ అప్డేట్ ని అయితే వారు ఆశిస్తున్నారు. సో దీనిపై చిత్ర యూనిట్ గతంలో RRR సినిమాకి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల బర్త్ డే లకి ప్లాన్ చేసినట్లు సాలిడ్ ట్రీట్ ఏమన్నా ప్లాన్ చేసారో లేదో అనేది వేచి చూడాలి.
