ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రమే “వారణాసి”. ఈ మెగా ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న మహేష్ నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పడింది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో జయకృష్ణ ఘట్టమనేని పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
మరి ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మహేష్ బాబు రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ హిట్ చిత్రం మంగళవారం దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో జయకృష్ణ మంచి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. బుల్లెట్ పై గన్ పట్టుకొని సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.
అలాగే ఈ చిత్రానికి “శ్రీనివాస మంగాపురం” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. దీనితో ఈ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ చిత్రం యూనిట్ పై మహేష్ బాబు తన బెస్ట్ విషెస్ అందిస్తూ ఒక స్ట్రాంగ్ టీం, మంచి ఆరంభం ఇది అంటూ తన ఆశీస్సులు అందించారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో రాబోతుంది.
Happy to unveil the first look of #SrinivasaMangapuram… ????????????
Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.
A strong team and an interesting beginning… all the best to the entire team ????????????????????????@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026
