‘వారణాసి’ టు గ్లోబల్.. ఒకపక్క షూట్ మరోపక్క ప్రమోషన్స్ తో రాజమౌళి మాస్టర్ ప్లానింగ్స్

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “వారణాసి”. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా గ్లోబల్ లెవెల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకొని రాబోతుంది. అయితే గ్రాండ్ ఎలిమెంట్స్ తో ఎక్కడా తగ్గకుండా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒకపక్క షూటింగ్ మరోపక్క గ్లోబల్ లెవెల్ ప్రమోషన్స్ తో ఈక్వల్ గా దూసుకెళ్తుంది అని చెప్పాల్సిందే.

మొన్ననే మెక్సికో ఈవెంట్ లో టీం పాల్గొనగా ఇప్పుడు జూన్ లో జక్కన్న సరికొత్త టూర్ స్టార్ట్ చేయనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈసారి ఫ్రాన్స్ లో రాజమౌళి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో హాజరు కానున్నట్టు ఖరారు అయ్యింది. జూన్ చివరి నుంచి జక్కన్న అక్కడ పర్యటించనున్నారట. అలాగే దీనిపై ఎస్ ఎస్ కార్తికేయ కూడా ఇది ఫన్ గా ఉండబోతుంది అంటూ తెలిపాడు. ఇలా మొత్తానికి సందు దొరికినప్పుడల్లా తన వారణాసి చిత్రాన్ని గ్లోబల్ లెవెల్లో ప్రెజెంట్ చేయడంలో మాత్రం రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్ అని చెప్పాల్సిందే.

Exit mobile version