సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంచు మోహన్ బాబు, కుమారుడు విష్ణులతో ‘రౌడీ’, ‘అనుక్షణం’ సినిమాలను తెరకెక్కించారు. తాజాగా మంచు లక్ష్మితో ‘ఎ డే ఇన్ ది లైఫ్ అఫ్ మంచు లక్ష్మిస్ ఫీట్’ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో మంచు లక్ష్మి దినచర్యను చూపిస్తారని సమాచారం.
టైటిల్ ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్తుంది. మంచు లక్ష్మి డైలీ రొటీన్ వర్క్ మీద డాక్యుమెంటరీలా ఉంటుందని టాక్. 2 నిముషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ ను త్వరలో యుట్యూబ్ లో రిలీజ్ చేస్తారు.
రామ్ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగల ముఠా’, ‘డిపార్ట్మెంట్’ సినిమాలలో మంచు లక్ష్మి నటించారు. వీరిద్దరికీ కలసి చేస్తున్న ‘ఎ డే ఇన్ ది లైఫ్ అఫ్ మంచు లక్ష్మిస్ ఫీట్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
