మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడు వరకు నటించిన అన్ని సినిమాలు కూడా ఏదొక కొత్త ప్రయత్నం కనిపిస్తుంది. అలా లేటెస్ట్ గా వచ్చిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే సాలిడ్ టాక్ సొంతం చేసుకొని డే 1 అదరగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా వరుణ్ తేజ్ ఈ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చినట్టే అని చెప్పాలి.
గత 24 గంటల్లో 2 లక్షలకి పైగా ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లలో టికెట్ సేల్స్ జరుపుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజుకి 10 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టినట్టు తెలుస్తుంది. ఇది వరుణ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే భారీ గ్రాఫ్ పెరిగింది అని చెప్పాలి. సో తనకి ఇది మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించారు.
