రెగ్యులర్ షూటింగ్ లో వరుణ్ తేజ్ ‘కంచె’

varun-tej
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ చేసిన మొదటి సినిమా ‘ముకుంద’ తనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి సినిమాలు అందించిన క్రిష్ తో వరుణ్ తేజ్ తన సెకండ్ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 27న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి ‘కంచె’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా రెగ్యుల ర షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. క్రిష్ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా సినిమాని ఫినిష్ చేస్తున్నాడు.

ఈ సినిమా 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుంది. ఇదొక ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఈ చిత్ర టీం ఉంది. వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు.

Exit mobile version