గీతా ఆర్ట్స్ లో వరుణ్ తేజ్ రెండో సినిమా..?

varun-tej
మెగా హీరోలకు బాగా కలిసొచ్చిన బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’. మెగా వారసులైన రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ లు హీరోగా తమ రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేశారు. అవి విజయం సాదించాయి. ఇదే సెంటిమెంట్ ను ‘ముకుంద’గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరుణ్ తేజ్ కూడా ఫాలో అవుతున్నారని సమాచారం.

వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వం వహిస్తారట. తొలి ప్రయత్నం ‘ముకుంద’ ఆశించిన విజయం అందించకపోవడంతో రెండవ సినిమాపై మెగా కాంపౌండ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మెగా కుటుంబానికి మాస్ అభిమానులే బలం. వారిని ఆకట్టుకునే విధంగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వరుణ్ తేజ్ రెండవ సినిమా రూపొందించనున్నారు.

Exit mobile version