వింటేజ్ వైబ్స్, అదిరే డాన్స్ మూవ్స్ తో “వీరసింహా రెడ్డి” రెండో సాంగ్.!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి”. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ కోసం అయితే బాలయ్య ఫ్యాన్స్ సహా ఆడియెన్స్ కూడా మంచి ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి ఆల్రడీ వచ్చిన ఫస్ట్ సాంగ్ క్రేజీ హిట్ కాగా నెక్స్ట్ అయితే మేకర్స్ మంచి డ్యూయెట్ ని అయితే అనౌన్స్ చేయగా దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇపుడు రిలీజ్ చేసిన ఈ రెండో సాంగ్ కూడా ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది అని చెప్పాలి స్టార్టింగ్ బీట్ నుంచే బాలయ్య మరియు శృతి హాసన్ లు అదిరే డాన్స్ మూవ్స్ తో థ్రిల్ చేయగా వారు ఇద్దరు కూడా మరింత స్టైలిష్ గా ఇందులో కనిపిస్తున్నారు.ఇక నెక్స్ట్ థమన్ ఇచ్చిన ట్యూన్ మాత్రం వింటేజ్ బాలయ్య సాంగ్స్ ని గుర్తు చేసేలా ఉందని చెప్పాలి. అలాగే ఈ సాంగ్ కి తగ్గట్టుగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ కాగా ఈ సాంగ్ కూడా ఖచ్చితంగా మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version