
రచయిత నుండి దర్శకుడిగా మారిన వీరూపోట్లా 2013లో విష్ణుతో చేసిన ‘దూసుకెళ్తా’ సినిమా తరువాత తిరిగి వార్తలలోకి రాలేదు. అయితే ఈ దర్శకుడు తన తదుపరి సినిమా గోపీచంద్ తో వుంటుందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ పుకార్లను ఖండిస్తూ వీరుపోట్లా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వార్తలో నిజంలేదని తెలిపాడు. తన తదుపరి చిత్ర వివరాలు ఇంకా ఖరారు కాలేదని అధికారిక ప్రకటన కోసం కొన్నిరోజులు ఆగాల్సిందేనని తెలిపాడు. ఇదేకాక వీరుపోట్ల విక్టరీ వెంకటేష్, రవితేజల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ డైరెక్ట్ చెయ్యాల్సివుండగా కొన్ని కారణాల వలన అది ఆగిపోయినట్టు తెలుస్తుంది.