విజయం ఒక మనిషికి ఎంతో ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ఒకసారి రిస్క్ చేసాక అది విజయవంతమైతే భవిష్యత్తులో మరెన్నో రిస్క్ లు చేయడానికి కావాల్సిన ధైర్యం వస్తుంది. ప్రస్తుతం ‘విక్టరీ’ వెంకటేష్ ఇటువంటి దశ లోనే వున్నారు.
‘దృశ్యం’ విజయవంతం కావడం తో వెంకటేష్ మరి కొన్ని కొత్త రకం కధలను ప్రయత్నించడానికి సిద్దం అవుతున్నారు. ‘దృశ్యం’ ఒక సాహసోపేతమైన కథ సాధారణంగా కనపడే కుర్ర హీరోయిన్లు కాకుండా ఈ చిత్రం లో మధ్య వయసు హీరోయిన్ కనిపిస్తుంది. అయిన సరే కధ నచ్చడంతో వెంకటేష్ ముందు అడుగు వేసారు.
‘దృశ్యం’ లాంటి మంచి చిత్రం వల్ల వెంకటేష్ నుండి మనం మరిన్ని అర్ధవంతమైన చిత్రాలు చూడబోతున్నాం.
