వెంకటేష్ ప్రశంసలందుకున్న ‘మిస్ మ్యాచ్’ టీజర్

Venkatesh launches Mismatch teaser

‘ఆటగాడరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నిర్మల్ కుమార్ దర్శకత్వంలో అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్ ఎల్ పీ సంస్థలో నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం “మిస్ మ్యాచ్”. నేడు ఈ చిత్ర టీజర్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ టీజర్ వీక్షించిన వెంకటేష్ చిత్ర యూనిట్ సభ్యులకు ప్రశంసించడంతో పాటు వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ…మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. ‘మిస్ మ్యాచ్’ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజ గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా” అన్నారు.

‘మిస్ మ్యాచ్’ మూవీ టీజర్ విడుదలకు ముఖ్యఅతిధిగా వచ్చి తమ సినిమాకు సపోర్ట్ ఇచ్చినందుకు హీరోతో పాటు చిత్ర దర్శక నిర్మాత లు,వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిఫ్టన్ ఇలియాస్ అందించారు.

మిస్ మ్యాచ్ టీజర్

Exit mobile version