నిర్మాత సురేష్ బాబుకు, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహాకు మధ్య విభేదాలు నడుస్తున్నాయని గత రెండు మూడు రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆ వార్తల్లో కంచరపాలెం సినిమాను తక్కువ ధరకు కొని మంచి లాభాలు చూసిన సురేష్ బాబు ముందుగా చెప్పినట్టు లాభాల్లో చిత్ర నిర్మాతలకు షేర్ ఇవ్వలేదని, అందుకు వెంకటేష్ కోపంగా ఉన్నాడని, ఇకపై ఆయనతో కలిసి పనిచేయాలని అనుకోవట్లేదనేది సారాంశం.
దీనిపై స్పందించిన వెంకటేష్ మహా అవి అబద్దపు వార్తలని కొట్టి పారేశారు. వీలైనంత త్వరగా ఆ వార్తను తీసేయమని కోరుతూ తన గురించి వార్త రాసేప్పుడు తనను సంప్రదించమని, తన గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది తానొక్కడినేనని గట్టిగానే స్పందించాడు. దీనికి స్పందించిన నటుడు రానా సినిమాలకు స్వాగతం అంటూ ట్వీట్ పెట్టడం కొసమెరుపు.
Remove this #FakeNews asap. And contact me before writing anything about me or my films. Because I am the only reliable source you guys have to know about me. #HopingForResponsibleJournalism
— Venkatesh Maha (@venkateshmaha25) May 20, 2019
