ఈ సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తర్వాతి సినిమాల్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చేస్తున్నారు. అది ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం కాకుండా ఈ సీనియర్ హీరో ఇంకో రెండు సినిమాల్ని లాక్ చేసినట్టు తెలుస్తోంది.
వాటిలో ఒకటి ‘నేను లోకల్, సినిమా చూపిస్తా మామ’ ఫేమ్ త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో ఉంటుందట. అలాగే ఇంకో సినిమా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తారట. వీటిని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. వెంకీ సెట్ చేసిన లైన్అప్ చూస్తుంటే ఆయన్నుండి రానున్న ఏడాది కాలంలో మంచి సినిమాలు రావడం ఖాయమని అనిపిస్తోంది.
